కొచ్చిన్ షిప్ యార్డ్‌లో ప్రాజెక్టు ఆఫీసర్ పోస్టులు

కేరళలోని కొచ్చిలో ఉన్న కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ .. కొచ్చిన్ షిప్ యార్డ్ ముంబయి షిప్ రిపేర్ యూనిట్, ముంబయిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ ప్రాజెక్టు ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నది.
మొత్తం పోస్టులు 7 ఉన్నాయి. వీటిలో మెకానికల్ -6, ఎలక్ట్రికల్ -3, ఎలక్ట్రానిక్స్ 1 పోస్టు కలవు. సంబంధిత విభాగాల్లో 60% మార్కులతో మెకానికల్/ ఎలక్ట్రానికల్ / ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రు మెంటేషన్ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయస్సు మార్చి 3వ తేదీ నాటికి 30 ఏళ్లు మించకూడదు. అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తారు. ఎంపికైన వారికి మొదటి సంవత్సం నెలకు వేతనం రూ. 37 వేలు అందుతుంది. రెండో ఏడాదికి రూ. 38 వేలు.. మూడో ఏడాది రూ. 40వేలు.. వీటితో పాటు అదనపు పని గంటలకు నెలకు రూ. మరో 3వేలు ఇస్తారు.
దరఖాస్తులను వచ్చే నెల 3వ తేదీ లోపు పంపించాల్సి ఉంది. దరఖాస్తు ఫీజు రూ. 400గా నిర్ణయించారు. పూర్తి వివరాకలు అభ్యర్థులు https://cochinshipyard.in/ వెబ్‌సైట్ చూడగలరు.