పెరిగిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా బిఆర్ ఎస్ పార్టీ శ్రేణులు నిరసనలు..

హైదరాబాద్ (CLiC2NEWS): కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 50 మేర పెంచిన విషయం తెలిసినదే. వాణిజ్య సిలిండర్‌పై ఏకంగా రూ.350 పెంచడంతో గ్యాస్ ధర పెరుగుదలను నిరసిస్తూ బిఆర్ ఎస్ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ పిలుపు మేరకు బిఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తులు పెరిగిన గ్యాస్ ధరకు నిరసనగా ఆందోళనకు దిగారు. మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ గాంధీ విగ్రహం వద్ద వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. ట్యాంక్ బండ్ దగ్గరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ధర్నాలో పాల్గొన్నారు. ఎల్‌బినగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో మరోవైపు కుత్యుల్లాపూర్‌లో ఎమ్మెల్యే వివేకానంద ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నాకు దిగారు.
మంత్రి హరీశ్ రావు ఆధ్యర్యంలో మేడ్చల్ జిల్లాలోని ఘట్‌కేసర్ లో కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు. కరీనంగర్‌లోని తెలంగాణ చౌక్‌లో వంటా వార్పు కార్యక్రమం చేపట్టింది. మహబూబ్‌నగర్ తెలంగాణ చౌరస్తా వద్ద మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. సబ్సిడీని కూడా ఎత్తేసి.. వంట గ్యాస్ ధరను తరచూ పెంచుతూ సామాన్యులకు గుదిబండలా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ సిలెండర్ డెలివరీ చేసే వ్యక్తులకు ఇచ్చే ఛార్జీలతో కలుపుకొని మొత్తం 1200 చెల్లించాల్సి రావడంతో మధ్యతరగతి కుటుంబాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఆందోళనలు చేపట్టారు.