బ్యాంకులలో మహిళలకు మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించండి: ఆర్‌బిఐ గవర్నర్

ముంబయి (CLiC2NEWS): మహిళలకు బ్యాంకులలో మరిన్ని ఉద్యోగావకాశాలివ్వడం ద్వారా లింగ అంతరాన్ని తగ్గించవచ్చని రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ శక్తికాంతదాస్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సగటుతో పోలిస్తే భారత్‌లో మహిళా కార్మిక శక్తి తక్కవగా ఉందని, ఈ అంతరాన్ని తగ్గించడానికి మహిళలకు విద్య, నైపుణ్యాభివృద్ధి, పనిచేసే చోట భద్రత, సామాజిక అడ్డుగోడలను తొలగించే దిశగా కృషి చేయాలన్నారు. మహిళలు చేసే వ్యాపారాల కోసం ప్రత్యేక పథకానలు సృష్టించాలని సూచించారు. ఇప్పటికీ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థ (ఎమ్ ఎస్ ఎమ్ ఇ)ల్లో ఐదో వంతే స్త్రీల చేతిలో ఉన్నాయని, బ్యాంకింగ్ రంగం ముందుకు వచ్చి, మహిళల కోసం ప్రత్యేక ఆర్ధిక ఉత్పత్తులను సృష్టించాలన్నారు. లింగ అంతరాన్ని తగ్గించాలంటే రెండు విధాలుగా పనిచేయవచ్చు. ఒకటి ఆర్ధిక సంస్థల్లో అధిక ఉద్యోగావకాశాలివ్వడం.. రెండోది మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తనలు ప్రభుత్వ పథకాల ద్వార ప్రోత్సహించడం అని ఆయన తెలిపారు.