నింగిలోకి దూసుకెళ్లిన పిఎస్ ఎల్‌వి-సి59 రాకెట్
శ్రీహరికోట (CLiC2NEWS): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పిఎస్ ఎల్‌వి-సి59 రాకెట్‌ను నింగిలోకి ప్రయోగించింది. సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాపై పరిశోధనలు చేయడం కోసం పిఎస్ ఎల్‌వి-సి59 రాకెట్ ను ఇస్రో ప్రయోగించింది. గురువారం సాయంత్రం 4 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి ప్రయోగించింది. ఈ ప్రయోగం నిన్న చేపట్టాల్సివుంది. కానీ, సాంకేతిక లోపం కారణంగా గురువారంకు వాయిదా పడింది. ఐరోపా అంతరిక్ష సంస్థ(ఇఎస్ఎ)కు చెందిన ప్రోబా-3తో పాటు మరికొన్ని చిన్న ఉపగ్రహాలను ఈ రాకెట్ ద్వారా ప్రయోగించారు. ప్రోబా-3లో రెండు ఉపగ్రహాలు ఉంటాయి. వీటి బరువు 550 కిలోలు . సూర్యుడి బాహ్య వాతావరణంపై పరిశోధనలు కోసం ఇవి పరస్పరం సమన్వయంతో ఒక క్రమపద్దితిలో భూకక్ష్యలో విహరిస్తాయి. ఇటువంటి ప్రయోగం చేపట్టడం ఇది మొదటిసారని ఇఎస్ఎ వెల్లడించింది.