పిఎస్ ఎల్‌వి సి 53 మిష‌న్‌ ప్ర‌యోగం విజ‌యవంతం

శ్రీ‌హ‌రికోట (CLiC2NEWS): తిరుప‌తిలోని భార‌త అంత‌రిక్ష ప్ర‌యోగ కేంద్ర‌మైన స‌తీశ్ ధావ‌న్ స్పేస్ సెంట‌ర్ (షార్‌)నుండి పిఎస్ఎల్‌విసి 53 మిష‌న్ ప్ర‌యోగం విజ‌య‌వంతమైంది. గురువారం సాయంత్రం 6.02 గంట‌ల‌కు పిఎస్ ఎల్‌వి సి 53 నింగిలోకి దూసుకెళ్లింది. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్‌) వాణిజ్య ప‌ర‌మైన రెండో మిష‌న్ ఇది. సింగ‌పూర్‌, కొరియాకు చెందిన మూడు ఉప‌గ్ర‌హాల‌ను నిర్ణీత క‌క్ష్య‌లో ప్ర‌వేశ పెట్ట‌నుంది. డిఎస్‌-ఈఓ ఉప‌గ్ర‌హం బ‌రువు 365 కిలోలు. ఇది 0.5 మీట‌ర్ల రిజ‌ల్యూష‌న్ ఇమేజింగ్ సామ‌ర్థ్యంతో ఎల‌క్ట్రో ఆప్టిక్‌, మ‌ల్టీ-స్పెక్ట్ర‌ల్ పేలోడ్‌ను క‌లిగి ఉంది. పిఎస్ ఎల్‌వి సి 53 ప్ర‌యోగం విజ‌య‌వంతం కావ‌డం ప‌ట్ల శాస్త్ర‌వేత్త‌లు హ‌ర్హం చేశారు. పిఎస్ ఎల్‌వి సిరీస్‌లో ఇది 55వ ప్ర‌యోగం.

Leave A Reply

Your email address will not be published.