శ్రీహరికోట: మరికొన్ని గంటల్లో పిఎస్ఎల్‌వి-సి58 ప్రయోగం
![](https://clic2news.com/wp-content/uploads/2023/12/PS-LV-C58-experiment-in-a-few-hours.jpg)
శ్రీహరికోట (CLiC2NEWS): కొత్త సంవత్సరం తొలి రోజే పిఎస్ఎల్‌వి-సి58 ప్రయోగం.. ఈ ప్రయోగం విజయవంతం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) సర్వం సిద్ధం చేసింది. ఈ పిఎస్ ఎల్‌వి వాహకనౌక ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహం (ఎక్స్‌పోశాట్)ను అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఇస్రో ఛైర్మన్ సోమనాత్ తిరుపతి జిల్లా సూళ్లురుపేటలోని చెంగాళమ్మ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం ఉదయం 9.10 గంటలకు పిఎస్ ఎల్‌వి-సి58 వాహక నౌక షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుండి నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెడతామని సోమనాథ్ తెలిపారు. పిఎస్ ఎల్‌వి సిరీస్‌లో ఇది 60వ ప్రయోగం అని ఆయన తెలియజేశారు.