పునరావృతం దేనికి సంకేతం

గుండెలలో గూడు కట్టిన ఆవేధనంతా

లావాల ప్ర‌జ్వ‌రిల్లితే.., ఆగని ఆగ్రహజ్వాలలు

పెట్రోలై మండిపోతూ, అగ్ని కణికలై విస్తరిస్తూ

నిరుద్యోగం వెక్కిరించగా, లెక్క చేయని నిండుప్రాణం

నిమ్మలించిన నియామకాలు, నిప్పుతో చెలగాటాలు

తొలి ఉద్యమం, మలి ఉద్యమాలు

ఆత్మబలిదానాలు ఎందుకో

ఆత్మహత్యల పరంపర ఏమిటో

మిగులుతున్నాయి కడుపు కోతలే

నిన్న జరిగిందేమిటో, నేటి అనుభవాలేమిటో

తెలియదు తల్లి దండ్రులకు

అధికార ద్రోహం దహించి వేయగా

రెచ్చగొడుతున్న నాయకగణం

కలవరపడుతున్న కన్న హృదయం

ప్రాణాలు తీసుకునే సంస్కృతి వద్దని

వారించే వారే లేక, పావులవుతున్నది యువత

పదవులకు ముందు వరసలో వారు

ప్రాణాలు హరించిపోతున్నా వీరు

శరీరాలపై నాట్యమాడుతున్న లాఠీలు

బడుగులదేనా బలిదానాల బాధ్య‌త

ఏది నిజం, ఏదీ వృద్ధి, ప్రగతి ప్రచారాలు

అమ్మ,నాన్నాలు మేల్కోండి, మీ చేతుల్లో ఓటు ఆయుధం

వాస్తవాలు ఎరగండి, మంచి కాలం వస్తుంది

ముందుకు సాగాలనే మనస్సు ఆరాటం

-కోనేటి రంగయ్య
సీనియ‌ర్ పాత్రికేయులు


త‌ప్ప‌క చ‌ద‌వండి:   

కర్షకుల కాలం కాదిది

వైరాగ్యం

మీడియా ఊడిగం

అప్పులు+అమ్మకాలు =పరిపాలన

తాలిబన్ అర్థం విద్యార్థి.. కానీ

నిరీక్షణ

శ్రావణ లక్ష్మికి స్వాగతం

కంప్యూటర్ కాపురాలు

అవసరం

మగ సమాజం

అహం అదే ఇగో   
విమాన యానం     
రాజకీయ జలకాలా`టలా`
కోనేటి రంగయ్య: ఆశల పల్లకిలో..
కోనేటి రంగయ్య: మనసు ఆరాటం
Leave A Reply

Your email address will not be published.