ముఖ్య‌మంత్రి కెసిఆర్‌తో పంజాబ్ సిఎం భ‌గ‌వ‌త్‌మాన్ సింగ్ భేటీ

హైద‌రాబాద్ (CLiC2NEWS): ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కెసిఆర్ పంజాబ్ సిఎం భ‌గ‌వంత్ సింగ్‌ మాన్‌తో స‌మావేశ‌మ‌య్యారు. దేశ రాజ‌కీయ ప‌రిస్థితులు, ప‌లు జాతీయ అంశాలపై ఇరువురు ముఖ్య‌మంత్రులు చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. భార‌త్ రాష్ట్ర స‌మితి (బిఆర్ఎస్) కేంద్ర కార్యాల‌యాన్ని సిఎం కెసిఆర్ ఢిల్లీలో ప్రారంభించిన విష‌యం తెలిసిన‌దే. నాటి నుండి ప‌లు రాష్ట్రాలకు చెందిన నాయ‌కులు, ప్ర‌ముఖులు సిఎం కెసిఆర్‌తో స‌మావేశ‌మ‌వుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.