పాక్ అథ్లెట్ నదీమ్‌కు పంజాబ్ సిఎం భారీ నజరానా..
ఇస్లామాబాద్ (CLiC2NEWS): పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా రజతం , పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ జావెలిన్ త్రోలో స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నదీమ్‌కు పాకిస్థాన్ ప్రముఖులు భారీ రివార్డులు ప్రకటించారు. తాజాగా పాక్ మాజి ప్రధాని నవాజ్ షరిఫ్ కుమార్తె,
పంజాబ్ ప్రావిన్సు తొలి సిఎం మరియం నవాజ్ కూడా భారీ నజరానాతో సత్కరించారు. నదీమ్‌కు రూ.10 కోట్ల రివార్డు అందించారు. అంతేకాక హోండా సివిక్ కారును బహుమతిగా ఇచ్చారు. ఆ కారుకు ప్రత్యేకంగా నెంబర్ ప్లేట్ చేయించారు. అందేంటంటే నదీమ్ సాధించిన రికార్డు. పారిస్ ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో 92.97 మీటర్లు విసిరి స్వర్ణం సాధించాడు. దానికి గుర్తుగా 92.97 నంబర్ ప్లేట్ చేయించారు.
నదీమ్‌కు పాకిస్తాన్ సింగర్ అలీ జఫర్ 1 మిలియన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. పంజాబ్ గవర్నర్ సర్దార్ సలీం హైదర్ఖన్ 2 మిలియన్ రివార్డు అందించారు. సింధ్ సిఎం 50 మిలియన్ మొత్తాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా సింధ్ గవర్నర్ 1 మిలియన్ ప్రకటించారు.