నిరాడంబరంగా పంజాబ్ సిఎం వివాహం..
![](https://clic2news.com/wp-content/uploads/2022/07/PUNJAB-CM-MARRIAGE.jpg)
చండీగడ్ (CLiC2NEWS): పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వివాహం సిఎం నివాసంలో నిరాడంబరంగా జరిగింది. హరియాణాకు చెందిన డాక్టర్ గురుప్రీత్‌కౌర్‌ను గురువారం ఆయన వివాహం చేసుకున్నారు. ఎటువంటి బాజా భజంత్రీలు, హంగు ఆర్భాటాలు లేకుండా చండీగఢ్‌లోని సిఎం నివాసంలో అత్యంత సన్నిహితుల మధ్య సిక్కు సంప్రదాయం ప్రకారం పెళ్లిచేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆప్ ఎంపి రాఘవ్ చద్దా హజరయ్యారు.