Punjab: ఎన్నికలు వాయిదా వేయాలని కోరిన సిఎం
న్యూఢిల్లి (CLiC2NEWS): పంజాబ్‌లో నిర్వహించే ఎన్నికలు వాయిదా వేయాలని ఆరాష్ట్ర ముఖ్యమంత్రి, చరణ్‌జిత్‌సింగ్ చన్నీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈమేరకు ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాశారు. దేశంలోని ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఖరారైన విషయం తెలసినదే. వచ్చే ఫిబ్రవరి 14 వతేదీన ఎన్నికలు జరగున్నాయి.
ఫిబ్రవరి 10వ తేదీనుండి 16 వ తేదీ వరకు ఉత్తర్ ప్రదేశ్‌లో గురురవిదాస్ జయంతి వేడుకలు జరగనున్నాయి. పంజాబ్ నుండి కు దదాపు 20 లక్షల మంది బెనారస్‌కు వెళ్లే అవకాశం ఉన్నదని సిఎం వెల్లడించారు. పిబ్రవరి 14 వతేదీన జరిగే ఎన్నికలలో వారు తమ ఓటు హక్కు వినియోగించుకోలేరని, అందుకోసం కనీసం ఆరు రోజులపాటు ఎన్నికలను వాయిదా వేయాలని లేఖలో పేర్కొన్నారు.