ప‌డిలేచిన కెర‌టం.. పంజాబ్ లో ఆప్ భారీ విజయం..

ఒక‌ప్పుడు హాస్యన‌టుడిగా ఉన్న ఆయ‌న నేడు జ‌న నేత అయ్యాడు. పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ పగ్గాలు చేప‌ట్ట‌నుంది. భ‌గ‌వంత్ మాన్ ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహించ‌బోతున్నాడు. ఓవైపు ఆప్‌ను దేశ‌మంతా విస్త‌రిస్తామ‌ని ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రివాల్ పేర్కొన్నారు. దీనికోసం ప్ర‌జ‌లంతా స‌హ‌క‌రించాల‌ని కోరారు.

పంజాబ్‌లో 2014 తొలిప్ర‌య‌త్నంలోనే 13 లోక్‌స‌భ స్థానాల‌కు 4 చోట్ల ఆప్ విజ‌యం సాధించి అంద‌రిదృష్టినీ ఆక‌ర్షించింది. త‌రువాత మూడేళ్ల‌కు 2017లో 20 స్థానాలు గెలుపొంది ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా అవ‌త‌రించింది. త‌రువాత ఆపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్క‌రుగా కాంగ్రెస్‌లోకి జ‌రుకున్నారు. 2019లో ఆ పార్టీ ఘోర వైఫ‌ల‌యం చెందింది. సంగ్రూర్ నుండి మాన్ ఒక్క‌రే విజ‌యం సాధించారు. కానీ మూడేళ్లు తిర‌గ‌క‌ముందే ఇప్ప‌టి అపెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆప్ తిరుగులేని విజ‌యాన్ని న‌మోదు చేసింది.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సంచలనం సృష్టించింది.  117 అసెంబ్లీ స్థానాల్లో  92  గెలుపొందింది. పంజాబ్ ప్ర‌జ‌లు అద్భుత‌మైన తీర్పు ఇచ్చారు. ఆప్‌ను దేశ‌మంతా విస్త‌రిస్తామ‌ని, ప్ర‌జ‌లు ఆద‌రించాలి అని ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ అన్నారు.

పంజాబ్‌లో దూసుకెళ్తున్న ఆప్‌..

పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్య‌ర్థులు దూసుకుపోతున్నారు. ఇక్క‌డ అధికార కాంగ్రెస్ డీలా ప‌డింది. పాటియాల అర్భ‌న్ నుంచి పోటీ చేసిన పంజాబ్ మాజీ సిఎం అమ‌రీంద‌ర్ సింగ్ ఓడిపోయారు. ఇక లంబీ నుంచి పోటీ చేసిన శిరోమ‌నీ అకాలీద‌ళ్ నేత ప్ర‌కాశ్ సింగ్ బాద‌ల్ కూడా  ఓడిపోయారు . అలాగే పంజాబ్ సిఎం చర‌ణ్ సింగ్ చ‌న్నీ రెండు చోట్ల నుంచి పోటీ చేశారు. చౌమ్‌కౌర్ సాహిబ్‌, బ‌హ‌దూర్ అసెంబ్లీ స్థానాల‌లో సిఎం రెండు చోట్ల ఓడిపోయారు.  అలాగే అమృత్‌స‌ర్ ఈస్ట్ నుంచి పోటీచేసిన న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూ కూడా ఓడిపోయారు.

Leave A Reply

Your email address will not be published.