ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధు దారుణ హత్య..!
ఛండీగడ్ (CLiC2NEWS): పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాల హత్యగావించబడ్డారు. మాన్సా జిల్లాలోని స్వగ్రామానికి స్నేహితులతో కలిసి వెళుతుండగా.. మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ని తుపాకీతో కాల్చిచంపారు. సిద్ధూ మూసేవాల బుల్లెట్ గాయాలతో వాహనంలోని తనసీటులోనే కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. విఐపిలకు భద్రత తొలగిస్తూ పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం నిర్ణయం తీసుకుంది. ఆ మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం.
మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు భద్రతను రద్దు చేసిన పంజాబ్ సర్కార్.. తాజాగా పలువురు రాజకీయ ప్రముఖులు, మత పెద్దలకు కూడా భద్రతను తొలగించింది. రిటైర్డ్ పోలీసులు అధికారులు, మత పెద్దలు, రాజకీయ నేతలు ఇలా 424 మందికి కేటాయించిన పోలీసు భద్రతను ఉపసంహరించుకున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది