పూరి డైరెక్షన్‌లో విజయ్ సేతుపతి ..

పూరి జగన్నాథ్- విజయ్ సేతుపతి కాంబినేషన్ షురూ కాబోతున్నట్లు సమాచారం. తెలుగులో సైరా, ఉప్పెన తదితర చిత్రాలతో పాటు పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు వారికి విజయ్ సేతుపతి దగ్గరయ్యిన విషయం తెలిసిందే. త్వరలో పూరి దర్వకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా సినిమా పట్టాలెక్కనున్నట్లు నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్ ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం వివరాలు వెల్లడించింది. ఈ చిత్రం జూన్ నుండి షూటింగ్ కాబోతున్నదని తెలియజేసింది. ఈ చిత్రానికి బెగ్గర్ టైటిల్ పరిశీలనతో ఉన్నట్లు సమాచారం. హిట్టే లక్ష్యంగా పూరి.. మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నారని, విజయ్ సేతుపతి హీరోగా తన తదుపరి చిత్రం తెరకెక్కిస్తున్నారని ఇటీవల వర్తలొచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో రానున్న సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది.