అల్లు అర్జున్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. పుష్ప 2 టీజ‌ర్‌..!

హెడ్‌ఫోన్స్ రెడీ చేసుకోండి..

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా పుష్ప‌2 టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి చిత్ర బృందం సిద్ద‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ పుష్ప‌2 చిత్రం కోసం సినీ ప్రేక్ష‌కులు ఎదురు చూస్తున్నారు. అయితే ఆయ‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా టీజ‌ర్ రిలీజ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవి మేక‌ర్స్ ఓ ఫోటోను షేర్ చేశారు. సుకుమార్‌, అల్లు అర్జున్‌, దేవిశ్రీ ప్ర‌సాద్ క‌లిసి దిగిన ఫోటో కు ‘హెడ్‌ఫోన్స్ రెడీ చేసుకోండి.. పుష్ప‌2 టీజ‌ర్‌కు సెన్సేష‌న‌ల్ బిజిఎం రాబోతుంద‌ని’ పేర్కొంది.

పుష్ప -1 లో పాటలు ఎంత‌గా శ్రోత‌ల‌ను అల‌రించాయో .. అంత‌కు మించిన మ్యూజిక్ ఆల్బ‌మ్‌ను అందించేందుకు దేవీశ్రీ రెడీ అయ్యారు. టీజ‌ర్‌కు నేప‌థ్య సంగీతం అందించ‌డంతో పాటు , సినిమాలోల‌ని పాట‌ల‌కు సంబంధించిన ఫైన‌ల్ వెర్ష‌న్స్ కూడా సిద్దం చేస్తున్నారు. మే చివ‌రి నాటికి ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్తి చేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.