తిరుమ‌ల శ్రీవారిని దర్శించుకున్న పివి సింధు

తిరుమల (CLiC2NEWS): టోక్యో ఒలింపిక్స్‌ విన్నర్ పివి సింధు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నది. గురువారం రాత్రి తిరుమల చేరుకున్న ఆమె ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శనంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నది. అనంతరం రంగనాయకుల మండపంలో సింధుకు వేదపండితులు ఆశీర్వచనం, స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.

ఈ సంద‌ర్భంగా సింధు మాట్లాడుతూ.. శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది. ప్రతి ఏడాది స్వామి ఆశీస్సుల కోసం తిరుమలకు వస్తాను. ఈ సారి ఒలింపిక్స్ అయ్యాక తిరుమలకు వచ్చాను.. అని సింధు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.