ఎపి మంత్రి పేర్నినానిని కలసిన ఆర్ నారాయణమూర్తి..
సినిమా థియేటర్ల ఓనర్లకు ఊరట

అమరావతి (CLiC2NEWS): సినీ నటుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తితో పాటు పలువురు సినిమా థియేటర్ల యజమానులు ఎపి మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. ఈసందర్భంగా రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో సీజ్ చేసిన 83 థియేటర్లు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీని కోసం జిల్లా జాయింట్ కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ అధికారులు గుర్తించిన లోపాలను థియేటర్ల యజమానులు సరిదిద్దుకోవాలని తెలిపారు. అన్ని వసతులు కల్పించి నెలరోజులలో దరఖాస్తు చేసుకుంటే తిరిగి అనుమతిస్తారని తెలిపారు.