వృద్ధ దంపతుల హత్యకేసును ఛేదించిన పోలీసులు .. నిందితులు అరెస్టు

హైదరాబాద్ (CLiC2NEWS): రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పిధిలో వృద్ధ దంపతులు హత్య కేసును పోలీసులు ఛేదించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొట్టకూటికోసం వచ్చిన దంపతులు వ్యవసాయ క్షేత్రంలో కాపలాదారులుగా పనిచేస్తూ జీవిస్తున్నారు. వారిని మంగళవారం రాత్రి మామిడితోటలో దుండగులు దారుణంగా హత్యచేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రాచకొండ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం ముష్టి పల్లికి చెందిన మూగ( చింతబాయి) ఉషయ్య, అతడి భార్య శాంతమ్మ కొత్తగూడ సమీపంలోని వారి యజమాని మనోహర్‌రావుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో రెండున్నరేళ్లుగా కాపాలాదారులుగా పనిచేస్తున్నారు. తోటలోనే ఓ పక్కన షెడ్లలో నివాసం ఉంటున్నారు. వీరిని మంగళవారం రాత్రి దుండగులు దారుణంగా హత్యచేశారు.