ఘనంగా రాధ కుమార్తె కార్తిక వివాహం.. సినీ ప్రముఖుల సందడి
తిరువనంతపురం (CLiC2NEWS): కేరళలో అలనాటి నటి రాధ కుమార్తె, రంగం ఫేమ్ కార్తిక వివాహం ఘనంగా జరిగింది. రోహిత్ మేనన్‌తో ఆమె మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఈ వివాహానికి సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. చిరంజీవి-సురేఖ దంపతులు, రాధిక, సుహాసిని, రేవతి తదితరులు వేడుకలో పాల్గొన్నారు.
‘జోష్’ సినిమాతో కార్తిక హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ‘రంగం’ సినిమాతో ఆమె సక్సెస్‌ను అందుకుంది. దమ్ము, బ్రదర్ ఆఫ్ బొమ్మాళిలో ఆమె నటనతో తెలుగులో అలరించారు. ఆమె తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళ చిత్రల్లో కూడా నటించారు.