‘రాధేశ్యామ్’ సెకండ్ సర్ప్రైజ్.. ఏంటంటే?
హైదరాబాద్ (CLiC2NEWS): ప్రభాస్ అభిమానులకు మరో సర్ప్రైజ్. ‘రాధేశ్యామ్’ సినిమానుండి మరో పుల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఇప్పటికే ‘నగుమోము తారలే..’ పుల్ వీడియో సాంగ్ రిలీజ్ అయిన విషయం తెలిసినదే. తాజాగా చిత్రబృందం ‘ఈ రాతలే..’ పుల్ వీడియో గీతాన్ని విడుదలచేసింది. ఈ పాటలో ప్రభాస్ లుక్స్, పూజా హెగ్దే క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, ఇంకా అద్భుతమైన లొకేషన్లు అందరినీ ఆకట్టుకొనేలా ఉన్నాయి. ఈ పాటను కృష్ణ కాంత్ రచించిగా యువన్ శంకర్ రాజా, హరిణి ఇవటూరి ఆలపించారు. జస్టిన్ ప్రభాకర్ సంగీతమందించారు.