టిడిపిలోకి రఘురామకృష్ణంరాజు

పాలకొల్లు (CLiC2NEWS): ఎంపి రఘురామ కృష్ణంరాజు టిడిపిలో చేరారు. పాలకొల్లు ప్రజాగళం సభలో టిడిపి అధినేత చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రాణాలు ఒడ్డి పోరాడిన వ్యక్తి రఘురామ అని చంద్రబాబు అన్నారు. ఆయన్ని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నానన్నారు. రఘరామ మాట్లాడుతూ.. చంద్రబాబు చొరవతో మళ్లీ ప్రజలముందుకొచ్చానని, చంద్రబాబు, ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు.
ఒక ఎంపినీ తన నియోజక వర్గానికి రాకుండా చేసిన దుర్మార్గపు పాలన అవసరమా అని చంద్రబాబు ప్రశ్నించారు. పొలీసుల కస్టడీలోకి తీసుకొని ఇష్టానుసారంగా చిత్రహింసలకు గురిచేశారన్నారు. రాష్ట్రపతి, గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి అన్ని విధాలా ప్రయత్నిస్తే.. చివరకు కోర్టు జోక్యంతో రఘరామ బయటపడ్డారని , లేదంటే ఆయన్న మీరు చేసేవాళ్లు కాదు అని చంద్రబాబు అన్నారు. ఇలాంటి దుర్మార్గపు పాలన నుండి ప్రజాస్వామ్యాన్ని , పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.