ప్ర‌ధాని అభ్య‌ర్థిగా రాహుల్: రాజ‌స్థాన్ సిఎం అశోక్ గెహ్లాట్‌

జైపూర్ (CLiC2NEWS): వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఇండియా కూట‌మి త‌ర‌ఫున ప్ర‌ధాన మంత్రి అభ్య‌ర్థిగా కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు రాజ‌స్థాన్ సిఎం అశోక్ గెహ్లాట్ వెల్ల‌డించారు. ప్ర‌ధాని అభ్య‌ర్థిపై ఇండియా (I.N.D.I.A) కూట‌మిలో చ‌ర్చించిన‌ట్లు తెలిపారు. ఈ మేర‌కు అన్ని పార్టీలు అంగీక‌రించిన‌ట్లు గెహ్లాట్ తెలిపారు. అలాగే మ‌రోవైపు ప్ర‌ధాని మోడీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు గెహ్లాట్‌.. ప్ర‌ధాన మంత్రి మోడీ 2014 నుంచి అహంకార‌పూరిత వైఖ‌రిని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని ఆరోపించారు. కేవ‌లం భార‌తీయ జ‌న‌తా పార్టీ 31 శాతం ఓట్ల‌తోనే కేంద్రంలో స‌ర్కార్‌ను ఏర్పాటు చేసింద‌ని తెలిపారు. అలాగే దేశంలో మిగ‌తా 69 శాతం ప్ర‌జ‌లు ప్ర‌ధాని మోడీ స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా ఉన్నార‌న్న విష‌యాన్ని వారు గ్ర‌హించాల‌ని గెహ్లాట్ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.