సైకిల్ పై పార్ల‌మెంటుకు రాహుల్ గాంధీ

రాహుల్ నేతృత్వంలో.. విప‌క్షాల సైకిల్ యాత్ర

న్యూఢిల్లీ (CLiC2NEWS): లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌కు చెందిన విప‌క్ష పార్టీలు మంగ‌ళ‌వారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇచ్చిన అల్పాహార విందు స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. “ఆప్”, బి.ఎస్.పి లు మినహాయించి మొత్తం 18 పార్టీలకు చెందిన ఉభయసభలకు చెందిన నేతలు హాజరయ్యారు. విప‌క్ష పార్టీ నేత‌ల‌తో కాన్‌స్టూష‌న్ క్ల‌బ్‌లో స‌మావేశం జ‌రిగింది. కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివ‌సేన‌, ఆర్జేడీ, ఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఆర్ఎస్‌పీ, కేర‌ళ కాంగ్రెస్‌, జార్ఖండ్ ముక్తి మోర్చా, నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్‌, తృణ‌మూల్ కాంగ్రెస్‌, లోక‌తాంత్రిక్ జ‌న‌తాద‌ళ్ పార్టీల‌కు చెందిన ఫ్లోర్ లీడ‌ర్లు హాజ‌ర‌య్యారు. విప‌క్ష పార్టీ నేత‌ల‌తో బ్రేక్‌ఫాస్ట్ ముగిసిన త‌ర్వాత‌ రాహుల్ పార్ల‌మెంట్‌కు సైకిల్ యాత్ర చేప‌ట్టారు. ఆ ర్యాలీలో విప‌క్ష ఎంపీలు కూడా పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.