వయనాడ్ ఎంపి సీటును వదులుకున్న రాహుల్‌గాంధీ

ఢిల్లీ (CLiC2NEWS): సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ .. వయనాడ్, రాయ్‌బరేలి రెండు స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. వీటిలో ఏ స్థానాన్ని వదులుకుంటారాని అటు ప్రజలు .. ఇటు నేతలలో సైతం ఆసక్తి నెలకొంది. తాజాగా దీనిపై రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారు. రెండింటిలో దేన్ని వదులుకోవాలనే విషయంలో చాలా మదనపడినట్లు తెలిపారు. కేరళలోని వయనాడ్ ఎంపి సీటును వదులుకోనున్నట్లు తెలిపారు. అక్కడి నుండి ఆయన సోదరి ప్రియాంక గాంధీ పోటీకి దిగనున్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. వయనాడ్‌తో నా బంధం కొనసాగుతుందని, వయనాడ్‌ను తరచూ సందర్శిస్తుంటానన్నారు.