రేపు మణుగూరుకు రాహుల్ గాంధీ..
ఖమ్మం (CLiC2NEWS): రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచార పర్వాన్ని ఉద్ధృతం చేశాయి. ఢిల్లీ నుండి నేతలు రాష్ట్రానికి తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఎఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రచారంలో పాల్గొననున్నట్లు సమాచారం. రాహుల్ గాంధీ శుక్రవారం మణుగూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించనున్నారు. . పది నియోజక వర్గాల్లో రోడ్‌షోలు, కార్నర్ సమావేశాలు, నిర్వహించనున్నారు. రాహుల్ గాంధీ రేపు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుండి మణుగూరు చేరుకుని పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపనున్నారు. 19వ తేదీన ఇల్లెందు నియోజకవర్గంలో రోడ్‌షోను నిర్వహించనున్నారు.
నవంబర్ 22వ తేదీన కానీ 23న కానీ అశ్వారావుపేట, సత్తుపల్లి, వైరా , మధిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో రోడ్‌షోలు, కార్నర్ సమావేశాలకు ప్రియాంక గాంధీ హాజరుకానున్నట్లు సమాచారం.