రూ.650కోట్ల‌తో వ‌రంగ‌ల్‌లో రైల్ మాన్యుఫ్యాక్చ‌రింగ్ యూనిట్: కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి

హైద‌రాబాద్ (CLiC2NEWS): ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌రిధిలో 5 వందే భార‌త్‌రైళ్లు ఉన్నాయని, మ‌రిన్ని తీసుకువ‌స్తామ‌ని కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి తెలిపారు. ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌రిధిలో రైల్వే స్టేష‌న్‌ల‌ను ఆధునీక‌రిస్తున్నామ‌ని, 90శాతం రైల్వేలైన్ల విద్యాదీక‌ర‌ణ జ‌రిగింద‌ని మంత్రి తెలిపారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా రైల్వే బ‌డ్జెట్‌ను పెంచామ‌న్నారు. రూ. 720 కోట్ల‌తో సికింద్రాబాద్ రైల్వేస్టేష‌ణ్ ప‌నులు చేస్తున్న‌ట్లు.. వ‌చ్చే ఏడాదికి ఈ ప‌నులు పూర్తి చేస్తామ‌ని వెల్ల‌డించారు. యాదాద్రి వ‌ర‌కు ఎంఎంటిఎస్‌ను పొడిగించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌ని, దానికి రూ.650 కోట్లు అవ‌స‌ర‌మ‌ని మంత్రి చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.