భారీ వర్షాలకు కూలిన రైల్వే బ్రిడ్జ్..
సిమ్లా (CLiC2NEWS): ఈ మధ్య కాలంలో హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్సాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల మూలంగా పలు జిల్లాల్లో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరదల కారణంగా కంగ్రా జిల్లాలోని చక్కి రైల్వే బ్రిడ్జ్ ఇవాళ (శనివారం) ఉదయం కూలినిట్లు జిల్లా మేజిస్ట్రేట్ రొహిత్ రాథోడ్ తెలిపారు. మండి జిల్లాల్లో కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురిసినట్లు.. దానితో భారీగా వరద వచ్చినట్లు అధికారులు తెలిపారు.
స్థానికంగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో 14 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. చంబా జిల్లాలో వర్షాల కారణంగా కొండచరియలు విరిగి ఓ ఇంటిపై పడిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
#WATCH | Himachal Pradesh: The railway bridge on Chakki river in Himachal Pradesh’s Kangra district damaged due to flash flood, and collapsed today morning. The water in the river is yet to recede: Northern Railways pic.twitter.com/ApmVkwAkB8
— ANI (@ANI) August 20, 2022