Rain Alert: తెలంగాణలో 5 రోజులు భారీ వర్షాలు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ వ్యాప్తంగా నైరుతిపవనాలు విస్తరించాయి. దాని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. నైరుతి ప్రభావంతో రానున్న ఐదు రోజులు తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ, పశ్చిమ తెలంగాణలోని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. శుక్రవారం ఉమ్మడి మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.
భాగ్యనగరంలో వర్షం
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌నగరంలో శుక్రవారం పలుచోట్ల వర్షం కురిసింది. నగరంలోని బేగంబజార్, కోఠీ, సుల్తాన్ బజార్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. వార్షం కురిసిన ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.