వర్ష సూచన.. తెలంగాణకు 3 రోజులు వర్షాలు!

హైదరాబాద్ (CLiC2NEWS): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు, వరదలతో తమిళనాడు రాజధాని చెన్నై నగరం అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేని వర్షాలతో వీధులు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలతో చెన్నైలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఎపిలో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై లాంటి ప్రాంతాలు ఇంకా కోలుకోలేదు.
ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోనూ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.