తెలంగాణలో వర్షం.. పిడుగుపాటుకు గురై ముగ్గురు మృతి
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు ప్రజలు సేదతీరుతున్నారు. హైదరాబాద్‌లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్లు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్ జిల్లాలోని యాలాల మండలం పరిధిలో రెండు చోట్ల పిడుగులు పడటంతో ముగ్గురు మరణించారు. జంటుపల్లిలో ఇద్దరు.. బెన్నూరులో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.