ట్యాంక్‌బండ్ ప‌రిస‌రాల్లో వ‌ర్షం.. వానలోనూ గణేశ్ శోభాయాత్ర

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం కురిసింది. చార్మినార్‌, శాలిబండ‌, ఫ‌ల‌క్‌నమా, లాల్‌ద‌ర్వాజ‌, చంద్రాయ‌ణ‌గుట్ట‌, బ‌హదూర్‌పురా, మెజంజాహీ మార్కెట్ తో పాటు ట్యాంక్‌బండ్ ప‌రిస‌రాల్లో మోస్తారు వాన జ‌ల్లులు కురుస్తున్నాయి. పలుచోట్ల రహదారులు జలమయమయ్యాయి. వర్షంలోనూ గణేశ్ శోభాయాత్ర కొనసాగుతోంది. చిరుజల్లుల్లో తడుస్తూ.. భక్తులు గణపతి ముందు స్టెప్పులేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వర్షం వల్ల ట్రాఫిక్ జామ్ అయింది. అధికారులు రంగంలోకి దిగి వెంటనే ట్రాఫిక్ క్లియర్ చేశారు. మ‌రోవైపు కాసేప‌ట్లో మ‌హాగ‌ణ‌ప‌తి ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటోందని మంత్రి త‌లసాని తెలిపారు. నిమ‌జ్జ‌న ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న ఆయ‌న హుస్సేన్‌సాగ‌ర్‌లో బోటులో తిరిగారు.

Leave A Reply

Your email address will not be published.