రాగల మూడు రోజులు తెలంగాణలో ముసురే

హైదరాబాద్ (CLiC2NEWS): రానున్న మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్రమంతా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని మంగళవారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో మంగళ, బుధ, గురువారాల్లో తెలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.