హైదరాబాద్ లో వర్షం.. నాలాలో పడి చిన్నారి మృతి
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణరాజధాని హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. శనివారం కురిసిన భారీ వర్షానికి సికింద్రాబాద్, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ అకాల వర్షానికి ఆరు సంవత్సరాల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కళాసిగూడలో కిరాణా సరుకుల కోసం షాపుకి వెళ్లి వస్తూ నాలలో పడి కొట్టుకుపోయింది. వెంటనే స్థానికులు పోలీసులకు, జిహెచ్ ఎంసి అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు సిబ్బంది ఘటనాస్థలికి చేరుకని నాలలోని చిన్నారి మృతదేహాన్ని బయటకు తీసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు అధికారుల నిర్లక్ష్యం కారణంగా చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఇవాళ కురిసిన భారీ వర్షానికి రాంనగర్, మైండ్‌స్పేస్.. ఇలా తదితర ప్రాంతాల్లో వరద నీటిలో పలు వాహనాలు కొట్టుకుపోయాయి.