TS: మూడు రోజుల్లో పలు జిల్లాల్లో వానలు
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో నైరుతీ రుతుపవణాలు విస్తరించాయి. ఈ రుతుపవనాలు మూడు రోజు్లలోనే విస్తరించడంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణలో అత్యధికంగా నిర్మల్ జిల్లాలోని ముథోల్లో 13.28 సె.మీ. వర్షపాతం నమోదైంది. కాగా రుపుపవనాలు చురుగ్గా ఉండటంతో రానున్న మూడు రోజుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ రాష్ట్రం మీదుగా రాయలసీమ వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తు వద్ద కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని.. ఈ మేరకు ఆయా జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేసింది.