ఉత్తరాఖండ్‌లో వర్ష బీభత్సం
డెహ్రాడూన్ (CLiC2NEWS) : ఉత్తరాఖండ్‌లో మూడురోజులనుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒక ప్రక్క భారీ వర్షాల ధాటికి కేరళ రాష్ట్రమంతా అతలాకుతలమయ్యింది. ఉత్తరాఖండ్‌లోని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్, తపోవన్, చంద్రబాగా నదులు ఉప్పొంగుతున్నాయి. నైనిటాల్‌లో సరస్సు ఉప్పొంగడంతో రోడ్లు అన్నీ జలమయమయ్యాయి. అనేక చోట్ల రోడ్లపై కొండచరియలు విరిగిపడుతున్నాయి. బద్రీనాథ్ జాతీయ రహదారిపై లంబగడ్‌నల్లా వద్ద కొండచరియలు విరిగిపడటంతో.. ఒక కారు రోడ్డుపై చిక్కుకుంది. వెంటనే స్పందించిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అధికారులు క్రెన్ సహయంతో కారును సురక్షితంగా బయటకు తీసుకోచ్చారు.
ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు వరదలపై ఉత్తరాఖండ్ సిఎం తో ఫోన్‌లో మాట్లడి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కేంద్రంనుంచి పూర్తిస్థాయి సహాయం అందిస్తామని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం మూడు ఆర్మీ హెలికాప్టర్లను రంగంలోకి దింపినట్లు రాష్ట్ర సిఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు.