తెలంగాణలో రైతుబంధు సంబురాలు..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో రేపటినుండి రైతుబంధు సంబురాలు నిర్వహించాలని రాష్ట్ర ఐటి, పురపాలక వాఖ మంత్రి, టిఆర్ ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైతుల గురించి కెసిఆర్ తీసుకున్న గొప్ప కార్యక్రమం రైతుబంధు అని అన్నారు. ఈ పథకం ప్రారంభమైనప్పటినుండి జనవరి 10వ తేదీ నాటికి రూ. 50వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి జమకాబోతున్నాయన్నారు.
రైతుబంధు కార్యక్రమం ప్రారంభమైనప్పటినుండి రైతులందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని కెటిఆర్ వెల్లడించారు. దేశ చరిత్రలో ఎక్కడా లేదని , ఇది ఒక అద్భుమైన సందర్భం, దీనిని మనమంతా సెలెబ్రేట్ చేసుకోవాలన్నారు. రేపటి నుండి 10వ తేదీ వరకు వారం రోజుల పాటు రైతుబంధు ఉత్సవాలను నిర్వహించాలని కెటిఆర్ సూచించారు. కొవిడ్ పరిమితులను గుర్తుంచుకొని ఈ సంబరాలు నిర్వహించాలని సూచించారు.