రాజీవ్ యువ వికాసం ప‌థ‌కం గ‌డువు పొడిగింపు..

హైద‌రాబాద్ (CLiC2NEWS): నిరుద్యోగుల కోసం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన రాజీవ్ యువ వికాసం ప‌థ‌కం ప‌క‌డ్భందీగా అమ‌లు చేయాల‌ని డిప్యూటి సిఎం భట్టి విక్ర‌మార్క ఆదేశించారు. ఈ ప‌థ‌కం అమ‌లు తీరుపై వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా అధికారుల‌తో మాట్లాడారు. మంత్రి శ్రీధ‌ర్ బాబు, సిఎస్ , ప‌లువురు క‌లెక్ట‌ర్లు వీడియో కాన్ఫ‌రెన్స్‌లో పాల్గొన్నారు.

రాజీవ్ యువ వికాసం ప‌థ‌కం ద‌ర‌ఖాస్తుల గ‌డువును ఏప్రిల్ 14 వ‌ర‌కు తెలంగాణ ప్ర‌భుత్వం పొడిగించింది. ఈ ప‌థ‌కం కింద ల‌బ్ధిదారుల‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చేందుకు యూనిట్ల విలువ ఆధారంగా రుణాల‌ను మూడు క్యాట‌గిరీలుగా విభ‌జించారు. క్యాట‌గిరి-1 కింద రూ.ల‌క్ష వ‌ర‌క రుణం అందిస్తుంది. అందులో 80% రాయితీ ఉంటుంది. క్యాట‌గిరి-2 కింద రూ.ల‌క్ష నుండి రూ.2ల‌క్ష‌ల వ‌ర‌కు రుణాల‌ను మంజూరు చేస్తుంది. అందులో 70% రాయితీ కల్పిస్తుంది. క్యాట‌గిరి-3 కింద రూ.2ల‌క్ష‌ల నుండి రూ.3ల‌క్ష‌ల లోపు రుణాల‌ను మంజూరు చేస్తారు. దీనిలో 60% రాయితీ అందుతుంది.

Leave A Reply

Your email address will not be published.