రాజ్‌కోట్‌: టిఆర్‌పి గేమ‌జోన్‌లో ఘోర అగ్ని ప్ర‌మాదం.. 11 మంది మృతి

రాజ్‌కోట్ (CLiC2NEWS): గుజ‌రాత్‌లోని రాజ్‌కోట్ ప‌ట్టణంలో ఘోర అగ్ని ప్ర‌మాదం సంభ‌వించి 11 మంది మృత్యువాత ప‌డ్డారు. స్థానిక టిఆర్‌పి గేమ్‌జోన్‌లో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. ఈ ప్ర‌మాదంలో చిన్నారులు స‌హా 11 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు స‌మాచారం. పోలీసులు , అగ్నిమాప‌క సిబ్బంది సహాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగిస్తున్నారు. ఇంకా ప‌లువురు మంట‌ల్లో చిక్కున‌ట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం కూడా ఉన్న‌ట్లు స‌మాచారం.
ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై రాష్ట్ర ముఖ్య‌మంత్రి భూపేంద్ర ప‌టేల్ స్పందిస్తూ.. స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేయాల‌ని, క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని ఆదేశించారు. రాజ్‌కోట్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులంతా త‌క్ష‌ణ‌మే ప్ర‌మాద‌స్థ‌లానికి చేరుకుని ఎలాంటి ఇబ్బందులు తలెత్త‌కుండా చూడాల‌ని ఎక్స్‌లో పోస్టు చేశారు.

 

 

Leave A Reply

Your email address will not be published.