రాజ్‌కోట్ గేమింగ్‌జోన్ ప్రమాద ఘటన .. 27కు చేరిన మృతుల సంఖ్య
రాజ్‌కోట్ (CLiC2NEWS): గుజరాత్‌లోని రాజ్‌కోట్ గేమ్‌జోన్‌లో శనివారం అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 27 కు చేరింది. వీరిలో చిన్నారులు నలుగురు ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో దాదాపు 300కుపైగా ప్రజలు గేమ్‌జోన్‌లో ఉన్నరని గేమ్‌జోన్ అగ్నిమాపక అధికారి తెలిపారు. గేమ్‌జోన్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ప్రవేశ ద్వారం కూలిపోవడంతో ప్రజలు బయటకు రాలేక అందులోనే చిక్కుకుపోయారని తెలిపారు.
ప్రమాదం నుండి బయటపడ్డ వ్యక్తి మాట్లాడుతూ.. గేమ్‌జోన్ మొదటి అంతస్తులో మంటలు అంటుకున్నాయని అందరూ బయటకు వెళ్లిపోవాలని సిబ్బంది చెప్పారన్నారు. బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే అంతా పొగతో నిండిపోవడంతో ఎక్కడ ఏంజరుగుతుందో తెలియలేదన్నారు. వెనుక గేటు నుండి వెళ్లడానికి ప్రయత్నించగా.. అక్కడ కూడా మంటలు ఉండటంతో తనతోపాటు ఐదుగురు మొదటి అంతస్తు నుండి కిందికి దూకేశామని తెలిపారు.