ముఖ్య‌మంత్రి కెసిఆర్‌కు రాఖీ క‌ట్టిన అక్కాచెల్లెళ్లు

హైద‌రాబాద్ (CLiC2NEWS): ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ర‌క్షాబంధ‌న్ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. తెలంగాణ సిఎం కెసిఆర్ కు ఆయ‌న సోద‌రీమ‌ణులు రాఖీ క‌ట్టారు. అక్కాచెల్లెళ్లు ల‌క్ష్మ‌మ్మ‌, జ‌య‌మ్మ‌, ల‌లిత‌మ్మ ముగ్గురు క‌లిసి కేసీఆర్‌కు హార‌తి ప‌ట్టి, రాఖీలు క‌ట్టారు. అనంత‌రం సిఎంకు స్వీట్లు తినిపించి ఆశీర్వ‌దించారు. ముఖ్య‌మంత్రి మనవడు, మంత్రి కెటిఆర్‌ కుమారుడు హిమాన్షు కు సోదరి అలేఖ్య రాఖీ కట్టింది. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో జ‌రిగిన ర‌క్షాబంధ‌న్ వేడుక‌ల్లో ముఖ్య‌మంత్రి సతీమణి శోభ, మంత్రి కెటిఆర్ శైలిమ దంపతులు, ఎంపి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

1 Comment
  1. zoritoler imol says

    I just could not depart your web site before suggesting that I really enjoyed the standard information a person provide for your visitors? Is going to be back often to check up on new posts

Leave A Reply

Your email address will not be published.