లిటిల్ మెగా ప్రిన్సెస్‌కు స్వాగతం.. చిరంజీవి ట్వీట్
![](https://clic2news.com/wp-content/uploads/2023/06/RAMCHARAN-UPASANA.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): మెగా ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. రామ్ చరణ్- ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు.
మంగళవారం ఉదయం జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు ఆస్పత్రి ప్రకటన విడుదల చేసింది. మెగా ప్రిన్సెస్ రాకతో మెగా ఫ్యామిలీ అంతా ఆనందంలో మునిగిపోయారు.
లిటిల్ మెగా ప్రిన్సెస్‌కు స్వాగతం!! నీ రాకతో కోట్లాది మంది మెగా ఫ్యామిలీతో పాటు మా అందరికీ ఆనందాన్ని పంచావ్. రామ్‌చరణ్- ఉపాసనను తల్లి దండ్రులను చేశావు. మమ్మల్ని గ్రాండ్ పేరెంట్స్‌ను చేశావు . ఈ రోజు ఎంతో సంతోషంగా ఉంది. నిన్ను కోట్లాది మెగా ఫ్యామిలీ సభ్యులు ఆశీర్వదిస్తారు.. అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.