తల్లిదండ్రులు కాబోతున్న రామ్‌చరణ్ దంపతులు

హైదరాబాద్ (CLiC2NEWS): మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా సోషల్ మీడియాలో వెల్లడించారు.
“ హనుమంతుడు దయతో చరణ్ దంపతులు త్వరలోనే మొదటి బిడ్డను ఆహ్వానించబోతున్నారు. ప్రేమతో మీ సురేఖ-చిరంజీవి, శోభన-అనిల్ కామినేని“ అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
2012వ సంవత్సరంలో రామ్‌చరణ్, ఉపాసన వివాహం జరిగింది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. కాగా చెన్నైలో 9వ తరగతి వరకు చరణ్, ఉపాసనలు ఒకే స్కూలులో చదివారు.
కాగా ఈ మధ్యకాలంలో మెగా అభిమానులకు వరుస శుభవార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలోనే చిరంజీవి, రామ్‌చరణ్‌కు ఒకే సారి అవార్డులు వరించడం.. వారు నటించిన సినిమాలు మంచి విజయం సాధించడంతో మెగా అభిమానులు పండగ చేసుకున్నారు. తాజాగా చిరంజీవి వెల్లడించిన రామ్‌చరణ్, ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు… అనే వార్తతో అభిమానులు మెగాపవర్‌స్టార్ దంపతులకు.సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు.
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 12, 2022
you are in reality a good webmaster. The website loading speed is incredible. It kind of feels that you’re doing any distinctive trick. In addition, The contents are masterpiece. you’ve performed a wonderful activity in this matter!