లండన్ మ్యూజియంలో రామ్‌చరణ్ మైనపు విగ్రహావిష్కరణ..

Ramcharn: లండన్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో హీరో రామ్ చరణ్ మైనపు విగ్రహావిష్కరణ జరిగింది. ఈ మైనపు విగ్రహంలో రామ్‌చరణ్‌తో పాటు అతని పెంపుడు కుక్క రైమ్ కూడా ఉంది. ఇలా పెంపుడు జంతువుతో ఉన్న మైనపు విగ్రహం కలిగిన మొదటి వ్యక్తి రాణి ఎలిజబెత్ 2 కాగా.. రెండో వ్యక్తి రామ్‌చరణ్ కావడం విశేషం. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రామ్ చరణ్ తో పాటు ఆయన సతీమణి ఉపాసన, తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖ కుమార్తె క్లీంకార హాజరయ్యారు.