ప్రజలు ధైర్యంగా, స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి

రామగుండం పోలీస్ కమీషనరేట్

గోదావరిఖని (CLiC2NEWS): ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఈరోజు గోదావరిఖని పట్టణం కేంద్రంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సీఆర్పీఎఫ్ బలగాలతో గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ చౌక్ మీదుగా లక్ష్మి నగర్ రమేష్ నగర్, తిలక్ నగర్, పరరామ్ నగర్ నుండి జవహర్ లాల్ నెహ్రు స్టేడియం వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీ ఎం. శ్రీ‌నివాస్‌ మాట్లాడుతూ… పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లలో ఎలాంటి భయాందోళనకు తావు లేకుండా ఓటు హ‌క్కు వినియోగించుకోవాల‌ని కోరారు. ఎవరైనా అల్లర్లు సృష్టించాలని చూస్తే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీపీ హెచ్చరించారు. జిల్లాలో అక్రమంగా డబ్బు, మద్యం, ఇతర విలువైన వస్తువులు అక్రమ రవాణా అరికట్టేందుకు చెక్ పోస్ట్ దగ్గర, జిల్లా పరిధిలో ఆకస్మికంగా పకడ్బందీగా నాఖబంది, వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని సీపీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ చేతన ఐపిఎస్., అసిస్టెంట్ కమాండెంట్ పరమానంద్, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ లు ఇంద్ర సేనా రెడ్డి, రవీందర్, గోదావరిఖని 2 టౌన్ ఇన్స్పెక్టర్ రవీందర్, లింగ మూర్తి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఎస్ఐ లు, పోలీస్ సిబ్బంది, కేంద్ర బలగాల సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.