యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : రామగుండం సిపి

Ramagundam Police Commissionerate : యువతను మత్తు పదార్థాలకు బానిస కాకుండా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ గారు  పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో అధ్వర్యంలో గంజాయి మరియు కల్తీ కల్లు వినియోగం వల్ల జరిగే అనర్థాలపై రూపోందిన వాల్‌ పోస్టర్‌ను రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎం. శ్రీనివాస్  అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
 ఈ సందర్బంగా సిపి మాట్లాడుతూ.. గంజాయికి బానిసలుగా మారి యువత తమ భవిష్యత్తు నాశనం చేసుకొంటుందని దాని వలన వారి జీవితాలు విచ్చిన్నం కావడంతో పాటు తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురైవుతున్నారన్నారు. గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రజలందరు స్వచ్చందంగా ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు. గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడేవారి సమాచారాన్ని అందిచాల‌న్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గొప్యంగా వుంచబడుతాయని తెలియ‌జేశారు.
ఈ కార్యక్రమములో అడిషనల్ డిసిపి అడ్మిన్  సి. రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ బుద్దే స్వామి తదితరులు పాల్గొన్నారు.
Leave A Reply

Your email address will not be published.