కాశీలో పోలీసుల‌కు డ్రెస్ కోడ్ ధోతి-కుర్తా..

ల‌ఖ్‌న‌వూ (CLiC2NEWS): వార‌ణాసిలో గ‌ల ప్ర‌ముఖ ఆధ్యాత్మిక క్షేత్రం కాశి విశ్వ‌నాథ దేవాల‌యం వ‌ద్ద విధులు నిర్వ‌హించే పోలీసులు ధోతి-కుర్తా, మెడ‌లో రుద్రాక్ష మాల‌తో అర్చ‌కుల మాదిరిగా క‌నిపించారు. ఇది తీవ్ర వివాదానికి దారితీసింది. ఆల‌యంలో విధులు నిర్వ‌ర్తించే పోలీసులకు అక్క‌డి ప్ర‌భుత్వం కొత్త డ్రెస్‌కోడ్ ప్ర‌క‌టించింది. వారు ఖాకీ దుస్తుల్లో కాకుండా సంప్రదాయ వ‌స్త్ర‌ధార‌ణ‌లో క‌నిపించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ మేర‌కు వార‌ణాసి పోలిస్ క‌మిష‌న‌ర్ మోహిత్ అగ‌ర్వాల్ ఆదేశాలు జారీ చేశారు.

సామాజిక మాధ్య‌మాల్లో యోగి స‌ర్కార్‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై రాష్ట్ర మాజి సిఎం, స‌మాజ్‌వాదీ పార్టి అధినేత అఖిలేశ్ యాద‌వ్ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. పోలీసుల‌ను అర్చ‌కుల మ‌దిరిగా డ్రెస్‌కోడ్ ధ‌రించాల‌ని ఉత్త‌ర్వులు ఇచ్చిన వారిని స‌స్పెండ్ చేయాల‌న్నారు. రేపు ఎవ‌రైనా దీన్ని అవ‌కాశంగా తీసుకొని మోసాల‌కు పాల్పడితే ? ప్ర‌జ‌ల‌ను దోపిడి చేస్తే.. ప‌రిస్థితి ఏంట‌ని ?  దానికి ప్ర‌భుత్వం ఏం స‌మాధాన‌మిస్తుంద‌ని ప్ర‌శ్నించారు.

దీనిపై స్పందించిన క‌మిష‌న‌ర్ .. ఆల‌యాల్లో విధి నిర్వ‌హ‌ణ మిగ‌తా ప్రాంతాల‌తో పోలిస్తే విభిన్నంగా ఉంటుందిన‌, ఇక్క‌ద ర‌ద్దీ శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించ‌ద‌న్నారు. అయితే భ‌క్తుల‌కు త్వ‌ర‌గా ద‌ర్శ‌నం క‌ల్పించే క్ర‌మంలో కొన్ని సార్లు పోలీసులు వ్య‌వ‌హ‌రించే తీరు ప్రజ‌ల‌కు బాధ క‌లిగించ‌వ‌చ్చన‌న్నారు. అదేవారు ఆర్చ‌కుల మాదిరిగా కనిపిస్తే భ‌క్తులు సానుకూల కోణంలో ఆలోచించే అవ‌కాశం ఉంటుందనే ఆలోచ‌న‌తో డ్రెస్ కోడ్ మార్చామ‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.