ఝార్ఖండ్‌లో అధిక్యంలో అధికార పార్టి
రాంచీ (CLiC2NEWS): ఝార్ఖండ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడుతున్నాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో జెఎంఎం 26 స్థానాల్లో విజయం సాధించి 33 స్తానాల్లో ఆధిక్యం కొనసాగుతుంది. రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు జెఎంఎం 43 పోటీచేయగా.. కాంగ్రెస్ 30 సీట్లకు పోటీ చేసింది. అటు బిజెపి కూటమి 13 స్థానాల్లో గెలిచి, 10 స్థానాల్లో ముందంజలో ఉంది.
ఆదివాసి కోటాలో జెఎంఎం మరోసారి విజయకేతనం ఎగురవేసింది. ఎన్నో ఆరోపణలు, సవాళ్లు ఎదురైనా హేమంత్-కల్పనా జోడీ స్పష్టమైన మెజార్టి సాధించింది. సంక్షేమ, ఆదివాసి, సెంటిమెంటునతో సోరెన్ ప్రభుత్వం అనుకూల ఫలితాలు సాధించింది. సిఎం మయా సమ్మాన్ పేరుతో మహిళలకు నెలకు రూ. వెయ్యి ఇచ్చే పథకాన్ని రూ.2500లకు పెంచుతామని హామీ ఇచ్చింది.
భూవివాదానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో సిఎం పదవిలో ఉన్న హేమంత్ సోరెన్ అరస్టై జైలుకు వెళ్లారు. దీంతో చాంపాయీ సోరెన్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. ఆసమయంలో హేమంత్ సేరెన్ సతీమణి కల్పనా పార్టీలో కీలకంగా వ్యవహరించి.. అనతి కాలంలోనే ఉప ఎన్నికలో గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. హేమంత్ , కల్పానాల జోడీ రాష్ట్ర రాజకీయాల్లో ఆకర్షణా నిలిచింది.