కృష్ణవంశీ.. ‘రంగమార్తాండ’ సినిమా ట్రైలర్

హైదరాబాద్ (CLiC2NEWS): కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం రంగమార్తాండ. ఈ చిత్రం మార్చి 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్ రాహుల్ సిప్లిగంజ్, అనసూయ తదితరులు నటించారు. ఈ చిత్ర ట్రైలర్ ఆసక్తిగా .. హృదయాన్ని హత్తుకునేలా సాగింది. బ్రహ్మానందం కారెక్టర్ డిఫరెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. కామెడీ చేసే ఆయన ఈ సినిమా ప్రత్యేకంగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.