నందిగామ మండలంలో లారీని ఢీకొట్టిన కంటైనర్.. తండ్రీకొడుకులు మృతి
నందిగామ (CLiC2NEWS): కంటైనర్ అదుపుతప్పి ఆగిఉన్న గ్యాస్లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు ప్రాణాలు కోల్పోయారు. ఎన్టిఅర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్తున్న కంటైనర్ అదుపుతప్పి లారీని డీకొట్టింది. లారీ ఎదుట నిల్చొని ఉన్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లారీని ఢీకొట్టిన కంటైనర్ ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదానికి ముందు ఆగి ఉన్న లారీని ఆర్టిసి బస్సు ఢీకొట్టింది. దాంతో లారీ వద్దకు గ్రామస్థులు చేరుకున్నారు. అనంతరం కంటైనర్ లారీని ఢీకొట్టింది. మరణించిన వారు ఎన్టిఅర్ జిల్లా ఐతవరం గ్రామానికి చెందిన మాధవరావు, అతని కుమారుడు రామరాజుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.