అర్హులైన పేదలకు త్వరలో రేషన్ కార్డులు.. మంత్రి పొంగులేటి

హైదరాబాద్ (CLiC2NEWS): అర్హులైన పేదలకు త్వరలో తెల్లరేషన్ కార్డులు ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినేట్ సమావేశమైంది. కేబినేట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు మంత్రులు మీడియాకు వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేబినేట్ ఆమోదం తెలిపింది. మొదటి విడతగా 4.56 లక్షల ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. అంతేకాక మరికొన్ని గ్యారంటీలు అమలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. జస్టిస్ పిసి చంద్రఘోష్ నేతృత్వంలో కాశేశ్వరంపై విచారణ. వంద రోజుల్లో విచారణ పూర్తవ్యాలని కమిటీకి సూచన. రెండు రోజుల్లో 93% రైతు బంధు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.